తెలంగాణ భారత దేశంలో భాగం కాదా?
దిశ, ఖమ్మం: బీజేపీ ప్రభుత్వం కు రైతుల ఉసురు తగులుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మంత్రి తో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ […]
దిశ, ఖమ్మం: బీజేపీ ప్రభుత్వం కు రైతుల ఉసురు తగులుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మంత్రి తో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. కళ్లుండి చూడలేని.. చెవులు ఉండి వినలేని బీజేపీ ప్రభుత్వం కు రైతుల ఉసురు తగలకపోదన్నారు. తెలంగాణ కు ఒక న్యాయం .. పంజాబ్ కు ఒక న్యాయమా..? తెలంగాణ భారతదేశంలో భాగం కాదా..? అని ప్రశ్నించారు.
తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనదని, తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటుందా .. ? కొనదా..? స్పష్టం చేయాలన్నారు.. ! ఈ ధర్నా కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , డిసీసీబి చైర్మన్ కురాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, సూడా చైర్మన్ విజయ్, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, రైతులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.