సమాజానికి ‘దిశ’ నిర్ధేశం చేయాలి: ప్రశాంత్ రెడ్డి

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘దిశ ’ దిన పత్రిక సమాజానికి దిశా నిర్ధేశం చేయ్యాలని రాష్ర్ట రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ‘ దిశ ’ దిన పత్రిక నూతన సంవత్సర క్యాలండర్‌ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు విజి గౌడ్, డి రాజేశ్వర్ రావు, ఆకుల లలీతలతో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఆవిష్కరించారు. […]

Update: 2021-01-07 06:58 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘దిశ ’ దిన పత్రిక సమాజానికి దిశా నిర్ధేశం చేయ్యాలని రాష్ర్ట రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ‘ దిశ ’ దిన పత్రిక నూతన సంవత్సర క్యాలండర్‌ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు విజి గౌడ్, డి రాజేశ్వర్ రావు, ఆకుల లలీతలతో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… సమాజంలో పత్రిక రంగానికి విశిష్టమైన పేరు ఉందని అన్నారు. అవి నికార్సైన జర్నలిజానికి ప్రతీకలు అని అన్నారు. అదే కోవలో దిశ దిన పత్రిక నడవాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దిశ నిజామాబాద్ ప్రతినిధి అంతడ్పుల రామకృష్ణ, జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జీ గోనే లాలయ్య, నిజామాబాద్ రూరల్ ఇంచార్జీ తాళ్ల రజనీష్, బోదన్ ఇంచార్జీ తడప్ అబ్బయ్య, ఆర్మూర్ ఇంచార్జీ రోడ్డ మురళి, నిజామాబాద్ అర్బన్ ఇంచార్జీ కే. నవిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News