క్వారంటైన్‌కు సిద్ధపడితేనే రండి..!
కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్నినాని వెల్లడించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి 28 వేల మంది వచ్చారన్నారు. రాష్ట్రవ్యాపంగా 52వేల ఎన్ -95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 200, నియోజక వర్గంలో 100 ఐసోలేషన్ పడకలు, 400 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వందల సంఖ్యలో ఏపీ సరిహద్దులకి చేరుకుంటోన్న ఏపీ ప్రజలకు మంత్రి సూచన […]
కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్నినాని వెల్లడించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి 28 వేల మంది వచ్చారన్నారు. రాష్ట్రవ్యాపంగా 52వేల ఎన్ -95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 200, నియోజక వర్గంలో 100 ఐసోలేషన్ పడకలు, 400 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వందల సంఖ్యలో ఏపీ సరిహద్దులకి చేరుకుంటోన్న ఏపీ ప్రజలకు మంత్రి సూచన చేశారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌కు సిద్ధపడి వస్తేనే తీసుకుంటామని మంత్రి పేర్ని నాని స్సష్టం చేశారు.
Tags: minister, perni nani, pressmeet, ap news