ఇసుక కార్పొరేషన్ పై పెద్దిరెడ్డి సమీక్ష
దిశ, ఏపీ బ్యూరో: సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక లభ్యతను గుర్తించడం ద్వారా కొత్త ఇసుక రీచ్లను గుర్తించాలని భూగర్బ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఇసుక కార్పోరేషన్ పై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి అండ్ ఎండి హరినారాయణ్ పాల్గొన్నారు. పర్యావరణ చట్టాలకు లోబడి ఎక్కువ ఇసుక రీచ్‌లను […]
దిశ, ఏపీ బ్యూరో: సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక లభ్యతను గుర్తించడం ద్వారా కొత్త ఇసుక రీచ్లను గుర్తించాలని భూగర్బ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఇసుక కార్పోరేషన్ పై అధికారులతో సమీక్షించారు.
సమావేశంలో మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి అండ్ ఎండి హరినారాయణ్ పాల్గొన్నారు. పర్యావరణ చట్టాలకు లోబడి ఎక్కువ ఇసుక రీచ్‌లను ప్రారంభించడం ద్వారా వినియోగదారులకు సులువుగా ఇసుకను అందించాలని ఈసందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. కొత్త రీచ్‌లకు పర్యావరణ నియంత్రణ మండలి నుంచి అన్ని అనుమతులు త్వరగా తీసుకోవాలన్నారు.
జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఇసుక డిమాండ్, సప్లయ్‌పై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇసుక రీచ్‌లపై సమగ్ర మ్యాప్‌లను తయారు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్‌లతో సమన్వయం చేసుకునేలా బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. నదుల్లో వరదనీరు అధికంగా ఉన్న నేపథ్యంలో స్టాక్ యార్డుల నుంచి ఇసుకను సకాలంలో వినియోగదారులకు అందించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఇసుక పాలసీలు, వాటిలోని లోటుపాట్లపై చర్చించారు.