పవన్ అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతారు : గౌతంరెడ్డి
దిశ, ఏపీబ్యూరో : జనసేన నేత పవన్‌కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో దివిస్ పరిశ్రమ నెలకొల్పే ప్రాంతానికి వస్తున్నందున ప్రభుత్వం ఆగమేఘాలమీద కంపెనీలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించినట్లు చెప్పుకున్నారు. ఇది ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మంత్రి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. అసలు దివిస్ పరిశ్రమ గురించి పవన్‌కల్యాణ్ కు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఏ పరిశ్రమలోనైనా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేననే చట్టాన్ని […]
దిశ, ఏపీబ్యూరో : జనసేన నేత పవన్‌కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో దివిస్ పరిశ్రమ నెలకొల్పే ప్రాంతానికి వస్తున్నందున ప్రభుత్వం ఆగమేఘాలమీద కంపెనీలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించినట్లు చెప్పుకున్నారు. ఇది ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మంత్రి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. అసలు దివిస్ పరిశ్రమ గురించి పవన్‌కల్యాణ్ కు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఏ పరిశ్రమలోనైనా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేననే చట్టాన్ని 19, జూలై 2019లోనే తమ ప్రభుత్వం మొదటి కేబినెట్లో ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు.
అసలు ఆ పరిశ్రమ ఏర్పాటునకు భూములిచ్చింది గతంలో పవన్భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. తమ ప్రభుత్వం వచ్చాక అక్కడ ప్రజల ఆమోదంతోనే పరిశ్రమ నెలకొల్పాలని సూచించినట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాలుష్యం గురించి, ఆక్వా హేచరీస్భవితవ్యం గురించి ఓ కమిటీ వేసినట్లు తెలిపారు. అందరి ఆమోదంతోనే పరిశ్రమ కాలుష్య నివారణ కార్యక్రమం చేపట్టేట్లు ఒప్పించిన తర్వాతనే ముందుకెళ్లాలని, అప్పటిదాకా ఒక్క ఇటుక పెట్టరాదని ప్రభుత్వం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా అవగాహనారాహిత్యంతో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడవద్దని పవన్‌కు గౌతంరెడ్డి సూచించారు.