‘విశాఖలో ఆ సెంటర్ ఏర్పాటు చేస్తాం’
దిశ, ఏపీబ్యూరో: విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నలిన్ సింఘాల్‌తో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటునకు బీహెచ్ఈఎల్తో అవగాహన కుదిరింది. దీంతో పాఠశాల విద్య పూర్తయిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బీహెచ్ఈఎల్ సంయుక్తంగా సర్టిఫికేషన్ చేయనున్నాయి. బీహెచ్ఈఎల్ సెంటర్ […]
దిశ, ఏపీబ్యూరో: విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నలిన్ సింఘాల్‌తో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటునకు బీహెచ్ఈఎల్తో అవగాహన కుదిరింది.
దీంతో పాఠశాల విద్య పూర్తయిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బీహెచ్ఈఎల్ సంయుక్తంగా సర్టిఫికేషన్ చేయనున్నాయి. బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఓ కేంద్ర బృందం, నోడల్ అధికారి నియామకానికి ఈ సందర్భంగా అంగీకారం కుదిరింది. మంత్రి మేకపాటి ప్రతిపాదనల మేరకు ఐటీఐ కాలేజీలకు తోడ్పాటుతోపాటు నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యమందిస్తామని బీహెచ్ఈఎల్ సీఎండీ నలిన్ సింఘాల్ హామీ ఇచ్చారు.
ఇక బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఎంట్రపెన్యూర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకూ ఏపీ ప్రభుత్వం, బీహెచ్ఈఎల్ మధ్య అంగీకారం కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో జిల్లాకు ఒక సోలార్ ప్యానల్ ఏర్పాటునకు సంబంధించి మంత్రి హర్షం ప్రకటించారు.