శ్మశాన వాటికలను సుందరీకరించండి : మంత్రి మల్లారెడ్డి

దిశ, మేడ్చల్: ప్రత్యేక పారిశుధ్య పనుల్లో భాగంగా శ్మశాన వాటికలను సుందరీకరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఘట్కేసర్ మండలంలోని కొర్రెముల గ్రామంలో జెడ్పీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. గ్రామంలో మురికి నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రతిరోజూ ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా దోమల […]

Update: 2020-06-01 08:25 GMT

దిశ, మేడ్చల్: ప్రత్యేక పారిశుధ్య పనుల్లో భాగంగా శ్మశాన వాటికలను సుందరీకరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఘట్కేసర్ మండలంలోని కొర్రెముల గ్రామంలో జెడ్పీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. గ్రామంలో మురికి నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రతిరోజూ ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా దోమల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లు రాకుండా ముందు జాగ్రత్త పడాలని కోరారు. గ్రామంలోని వైకుంఠదామం, గ్రంథాలయం, పాఠశాలల్లో పారిశుధ్య పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మట్లాడుతూ.. పల్లె ప్రగతి ప్రత్యేక కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, ఆసుపత్రి, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Tags:    

Similar News