నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి

దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో గురువారం కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. శుక్రవారం జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి పంటలను పరిశీలించారు. మూడుచింతలపల్లి, పోచారం, లక్ష్మాపూర్, అవుతారం తదితర గ్రామాల్లో 198 మంది రైతుల పొలాల్లో సుమారు300 ఎకరాల్లో వరి, ఇతర ఉద్యాన పంటలు నష్టపోయాయి. ఈ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. నష్టపోయిన పంటల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో […]

Update: 2020-04-10 05:11 GMT

దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో గురువారం కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. శుక్రవారం జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి పంటలను పరిశీలించారు. మూడుచింతలపల్లి, పోచారం, లక్ష్మాపూర్, అవుతారం తదితర గ్రామాల్లో 198 మంది రైతుల పొలాల్లో సుమారు300 ఎకరాల్లో వరి, ఇతర ఉద్యాన పంటలు నష్టపోయాయి. ఈ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. నష్టపోయిన పంటల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పిస్తామని చెప్పారు. పంటలకు ఇన్సూరెన్స్ చేసిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Tags: Minister Malla Reddy, inspects, damaged crops, medchal

Tags:    

Similar News