రాష్ట్రంలో ఏ పార్టీ మిగలదు.. ఇదే నా మాట : మంత్రి కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ మిగలదని మంత్రి మల్లారెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. పల్లెప్రగతి, రైతుబంధు, రైతు బీమా, మహిళలకు పావలావడ్డీ, బడుగు, బలహీన వర్గాలకు రుణాలు ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేస్తుందని వెల్లడించారు. ప్రతి ఎకరాకు సాగు […]

Update: 2021-07-12 06:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ మిగలదని మంత్రి మల్లారెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. పల్లెప్రగతి, రైతుబంధు, రైతు బీమా, మహిళలకు పావలావడ్డీ, బడుగు, బలహీన వర్గాలకు రుణాలు ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేస్తుందని వెల్లడించారు. ప్రతి ఎకరాకు సాగు నీరందజేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని కితాబు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక ధాన్యం దిగుబడిని సాధించి దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..