కలెక్టర్ తో భేటీపై మంత్రి మల్లారెడ్డి క్లారిటీ
దిశ ప్రతినిధి, మేడ్చల్ : పల్లె, పట్టణ ప్రగతి లో స్వీకరించిన పలు అభివృద్ధి పనులకు విజ్ఠాపనలు, నిధుల మంజూరు కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గురువారం రాత్రి ఓ ప్రటకనలో పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన దివ్యాంగులకు డబల్ బెడ్ రూము ఇండ్ల ను అందించే ప్రక్రియను ప్రారంభించాలని అదేశించినట్లు తెలిపారు. నిధుల కొరతతో సతమతమవుతున్న జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ కు తన నియోజకవర్గ […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : పల్లె, పట్టణ ప్రగతి లో స్వీకరించిన పలు అభివృద్ధి పనులకు విజ్ఠాపనలు, నిధుల మంజూరు కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గురువారం రాత్రి ఓ ప్రటకనలో పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన దివ్యాంగులకు డబల్ బెడ్ రూము ఇండ్ల ను అందించే ప్రక్రియను ప్రారంభించాలని అదేశించినట్లు తెలిపారు. నిధుల కొరతతో సతమతమవుతున్న జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ కు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి రూ. 2 కోట్లు మంజూరుకు సంబంధించిన లేఖలను అందించినట్లు తెలిపారు. అదేవిధంగా జవహర్ నగర్, మూడు చింతల పల్లి మండలం ఉద్దేమర్రి గ్రామంలో రూ.25 లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి దత్తత గ్రామాలలో ఒకటైన కేశవపూర్ గ్రామంలో మురుగునీటి పైప్ లైన్లు ఏర్పాటు కోసం రూ. 35 లక్షల ప్రత్యేక నిధుల నుండి ఖర్చు చేయాలని అదేశించినట్లు తెలిపారు.
ఆక్రమణలకు గురి అవుతున్న శ్మశాన వాటికల స్థలాలను రక్షించుటకు అవసరమైన ప్రహరీ గోడల నిర్మాణం వంటి వాటికి నిధులు మంజూరు చేసి ప్రజల అభీష్టం మేరకు సౌకర్యాలు కల్పించాలని సూచించినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ నిర్మాణం కొరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరానన్నారు. మేడ్చల్ జిల్లా హరితహారం కార్యక్రమంలో ప్రధమ స్థానం పొందటం హర్షించదగ్గ విషయమని అలాగే పల్లె/పట్టణ ప్రగతి లో కూడా మేడ్చల్ జిల్లా ప్రధమ స్థానం లో నిలిపే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తోపాటు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సహంతో కృషి చేస్తానని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధి భౌగోళికంగా పెద్దది కావడం, హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో ఉండడం వలన మౌలిక వసతుల కల్పన కొరకు తీవ్రంగా కృషి చేయవలసిన అవసరం ఉందని, ప్రజలు సహృదయంతో వారి ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందించాలని కోరినట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.