‘గ్రేటర్’లో 105 స్థానాలు మావే : మల్లారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే GHMC ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 105 స్థానాలు వస్తాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఉందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు ఎన్నో నిర్మించామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. దేశంలో బీజేపీ చేసిందేమీ లేదని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. LRS ఉంటే పేదలకు మంచి జరుగుతుందని ఓ మీడియా […]
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే GHMC ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 105 స్థానాలు వస్తాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఉందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు ఎన్నో నిర్మించామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. దేశంలో బీజేపీ చేసిందేమీ లేదని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. LRS ఉంటే పేదలకు మంచి జరుగుతుందని ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మంత్రి వెల్లడించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమాన పరిచిందని.. కానీ, మేము ఆయన్ను గౌరవిస్తూ, భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసినట్లు వివరించారు.కేటీఆర్ ఎప్పటికైనా సీఎం అవుతారని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. వీఆర్వో వ్యవస్థ రద్దు నేపథ్యంలో ఏ ఒక్క వీఆర్వోను తొలగించబోమని మంత్రి స్పష్టంచేశారు.