అధికారికమైన KTR బర్త్ డే వేడుకలు.. యువరాజు సేవలో యంత్రాంగం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అధికార యంత్రాంగం, అమాత్యులు, నేతలు, అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, ఉద్యోగ సంఘాలు మొత్తం యువరాజు సేవలో తరించాయి. మంత్రి కేటీఆర్​బర్త్​డే వేడుకలను అధికారికంగా నిర్వహించాయి. అంతేకాదు.. కిందిస్థాయిలో కూడా అదేవిధంగా చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే తన బర్త్​డే వేడుకల సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన కేటీఆర్ మాత్రం.. ఎక్కడా మొక్క నాటలేదు. ఇవేం సర్క్యులర్ మంత్రి కేటీఆర్​బర్త్​డే వేడుకల సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ తెలంగాణ మైనార్టీ […]

Update: 2021-07-24 11:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అధికార యంత్రాంగం, అమాత్యులు, నేతలు, అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, ఉద్యోగ సంఘాలు మొత్తం యువరాజు సేవలో తరించాయి. మంత్రి కేటీఆర్​బర్త్​డే వేడుకలను అధికారికంగా నిర్వహించాయి. అంతేకాదు.. కిందిస్థాయిలో కూడా అదేవిధంగా చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే తన బర్త్​డే వేడుకల సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన కేటీఆర్ మాత్రం.. ఎక్కడా మొక్క నాటలేదు.

ఇవేం సర్క్యులర్

మంత్రి కేటీఆర్​బర్త్​డే వేడుకల సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ తెలంగాణ మైనార్టీ గురుకులాల సొసైటీ సెక్రెటరీ ఏకంగా ఓ సర్క్యులర్​విడుదల చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు, స్థానిక నేతలను సైతం భాగస్వాములను చేయాలంటూ పేర్కొన్నారు. విద్యా సంస్థల్లోని ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొనాలంటూ ఆదేశాలిచ్చారు.

మేమెందుకు చేయాలంటూ నిలదీసిన మున్సిపల్​చైర్​పర్సన్

మంత్రి పుట్టినరోజు వేడుకలకు సర్క్యులర్ జారీ చేయడంపై ఆదిభట్ల మున్సిపల్​చైర్​పర్సన్​కొత్త హార్థికగౌడ్​నిరసన వ్యక్తం చేశారు. ఆదిభ‌ట్ల మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ టీఆర్ఎస్ కార్యక‌ర్తలా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని, కేటీఆర్ బ‌ర్త్ డే రోజున చెట్లు నాటాల‌ని స‌ర్క్యుల‌ర్ ఎందుకు జారీ చేశారంటూ నిలదీశారు. క‌మిష‌న‌ర్ చాంబ‌ర్ ఎదుట నేల‌పై కూర్చొని నిర‌స‌న వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా హార్థిక‌ మాట్లాడుతూ.. క‌మిష‌న‌ర్ స‌ర‌స్వతి ఒక అధికారిణిలా కాకుండా, టీఆర్ఎస్ కార్యక‌ర్తలా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. కేటీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చెట్లు నాటాల‌ని సీడీఎంఏ, సీఎస్ నుంచి ఏమైనా ఆదేశాలు వ‌చ్చాయా? ఎందుకు స‌ర్క్యుల‌ర్ జారీ చేశార‌ని ప్రశ్నించారు.

అధికారికమేనా..?

రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్​పుట్టినరోజు వేడుకలను అన్ని వర్గాలు నిర్వహించడంపై వ్యతిరేకత ఎదురైంది. గతంలో లేని విధంగా అధికారులే దగ్గరుండి మొక్కల నాటడాన్ని పర్యవేక్షించడం, ఫొటోలు దిగి సోషల్​ మీడియాలో వైరల్​ చేసుకోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేస్తే తప్పు లేదు కానీ.. అధికారులు కూడా అలాగే చేయడంపై మండిపడుతున్నారు.

కేటీఆర్ దూరం :

ఇక తన బర్త్​డే రోజున వేడుకలకు దూరంగా ఉంటానని, తనను కలిసేందుకు ఎవరూ రావద్దని, ప్రతిగా ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చిన కేటీఆర్​వేడుకలకు మాత్రం దూరంగానే ఉన్నారు. కానీ అందరినీ మొక్కలు నాటాలని చెప్పి ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదు. కనీసం ప్రగతిభవన్‌లోనైనా మొక్క నాటుతారని భావించినా అక్కడ కూడా చేయలేదు. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News