భవిష్యత్ తరాలకు గ్రీనరి కానుక ఇద్దాం: కేటీఆర్

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం ఈ దఫా మరింత ఉధృతంగా హరితహారం చేపట్టనుందని, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్ తరాలకు గ్రీనరిని కానుకగా ఇద్దామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హరితహారం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం శంషాబాద్‌లోని హెచ్ఎండీఏ నర్సిరీని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అక్కడ కొనసాగుతున్న మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ […]

Update: 2020-06-17 08:07 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం ఈ దఫా మరింత ఉధృతంగా హరితహారం చేపట్టనుందని, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్ తరాలకు గ్రీనరిని కానుకగా ఇద్దామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హరితహారం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం శంషాబాద్‌లోని హెచ్ఎండీఏ నర్సిరీని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అక్కడ కొనసాగుతున్న మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాలన్నింటినీ హరిత పట్టణాలుగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా మొక్కలు కావాలంటే నర్సరీల నుంచి ఉచితంగా తీసుకోవచ్చని సూచించారు. ఒకట్రెండు రోజుల్లో నగరంలోని నర్సరీ ప్రాంతాల వివరాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా నర్సరీలో మొక్కలు పెంచుతున్న తీరు, ఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ప్రజలకు అందించే పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు పట్టణాలకు మొక్కలను తమ నర్సరీల నుంచి సరఫరా హెచ్ఎండీఏ సరఫరా చేస్తున్నదని అధికారులు తెలిపారు. నర్సరీలో పని చేస్తున్న కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో పనిచేసే అర్హులైన వారందరికీ ఈపీఎఫ్, పీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News