తెలంగాణ భవన్లో చేవెళ్ల టీఆర్ఎస్ నేతలు
దిశ, శంకర్పల్లి: తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు చేవెళ్ల నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు ఉద్యమ సమయంలో పనిచేసిన చేవెళ్ల నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలను కలిసి పేరుపేరునా పలకరించారు. పార్టీ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. […]
దిశ, శంకర్పల్లి: తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు చేవెళ్ల నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు ఉద్యమ సమయంలో పనిచేసిన చేవెళ్ల నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలను కలిసి పేరుపేరునా పలకరించారు. పార్టీ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, శంకర్పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్ మండలాల ఎంపీపీలు విజయలక్ష్మి, గోవర్ధన్ రెడ్డి, నక్షత్రం, కోట్ల ప్రశాంతి, జెడ్పీటీసీలు మాలతీ, గోవిందమ్మ, కాలె శ్రీకాంత్, పట్నం అవినాష్ రెడ్డిలతో పాటు ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.