పేదోడు ఆత్మగౌరవంతో బతకాలన్నదే లక్ష్యం

దిశ, వెబ్‌డెస్క్: పేదవారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో బుధవారం ఉదయం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 28.03 కోట్ల వ్యయంతో 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టిస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ఇలాంటి ఇళ్లు వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్మించలేదని అన్నారు. […]

Update: 2020-12-16 01:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: పేదవారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో బుధవారం ఉదయం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 28.03 కోట్ల వ్యయంతో 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టిస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ఇలాంటి ఇళ్లు వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్మించలేదని అన్నారు. ఒక్కో ఇంటికి రూ. 9 ల‌క్ష‌ల ఖ‌ర్చు పెట్టి నిర్మించామ‌ని తెలిపారు. దాదాపు రూ. 50 ల‌క్ష‌ల విలువ చేసే ఫ్లాట్‌ను పేద‌ల‌కు సీఎం కేసీఆర్ ఇస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మ‌ల్లేశం, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

Tags:    

Similar News