అందరినీ ఆదుకుంటాం : కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. కాలనీల్లోకి వరదనీరు చేరి ఇల్లు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ బీఎస్ మక్తాకాలనీలో షెల్టర్ హోమ్‌ను పరిశీలించారు. బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని […]

Update: 2020-10-16 02:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. కాలనీల్లోకి వరదనీరు చేరి ఇల్లు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఖైరతాబాద్ బీఎస్ మక్తాకాలనీలో షెల్టర్ హోమ్‌ను పరిశీలించారు. బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందరూ కాచిన నీటిని మాత్రమే వాడాలని సూచించారు.

Tags:    

Similar News