పాఠశాల స్థాయి నుంచే ఇన్నోవేషన్
దిశ, న్యూస్‌బ్యూరో: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లోని యువత, విద్యార్థుల ఆలోచనలకు ప్రోత్సాహం ఇచ్చేలా కొనసాగిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్‌పై మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పిల్లలకు పాఠశాల స్థాయిలోనే ఇన్నోవేషన్ సంస్కృతిని అలవాటు చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా విద్యాశాఖతో కలిసి పని చేయాలని సూచించారు. భవిష్యత్తులో చేపట్టబోయే విభిన్న కార్యక్రమాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలిపారు. గడిచిన ఐదేళ్లుగా […]
దిశ, న్యూస్‌బ్యూరో: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లోని యువత, విద్యార్థుల ఆలోచనలకు ప్రోత్సాహం ఇచ్చేలా కొనసాగిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్‌పై మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పిల్లలకు పాఠశాల స్థాయిలోనే ఇన్నోవేషన్ సంస్కృతిని అలవాటు చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా విద్యాశాఖతో కలిసి పని చేయాలని సూచించారు. భవిష్యత్తులో చేపట్టబోయే విభిన్న కార్యక్రమాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలిపారు. గడిచిన ఐదేళ్లుగా దేశ స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో తనదైన ముద్ర వేయకలిగిందన్నారు. ప్రస్తుతం టీ హబ్ ద్వారా అద్భుతమైన సేవలను అందిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సేవలనే ద్వితీయ శ్రేణి నగరాలకు అందించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు ప్రారంభించాలని మంత్రి సూచించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నందున ఇన్నోవేషన్ మరింత పెరగాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా రంగంలో పనిచేస్తున్న వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు.