కరోనాపై ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్( కొవిడ్ 19)ను కట్టడి చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న వివిధ సిబ్బంది సేవలను గుర్తిస్తూ నగర జీహెచ్ఎంసీమేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి ఒక ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. బొంతు శ్రీదేవి నిర్మించిన ఈ కరోనా వైరస్ అవగాహన గీతాన్ని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కందికొండ సాహిత్యాన్ని అందించారు. ఈ గీతాన్ని ఈరోజు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక గీతం చాలా […]

Update: 2020-04-28 05:34 GMT

దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్( కొవిడ్ 19)ను కట్టడి చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న వివిధ సిబ్బంది సేవలను గుర్తిస్తూ నగర జీహెచ్ఎంసీమేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి ఒక ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. బొంతు శ్రీదేవి నిర్మించిన ఈ కరోనా వైరస్ అవగాహన గీతాన్ని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కందికొండ సాహిత్యాన్ని అందించారు. ఈ గీతాన్ని ఈరోజు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక గీతం చాలా బాగావచ్చిందని కచ్చితంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తుందనీ, వైరస్ కట్టడీ కోసం పని చేస్తున్న వారి పట్ల గౌరవాన్ని పెంచుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ పాటను నిర్మించిన బొంతు శ్రీదేవితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.

Tags: Minister Ktr, covid 19 awareness song, production, bonthu sridevi, mayor, singer rahul

Tags:    

Similar News