క్షుద్రపూజలు చేశారు.. లోకేష్ ఓడిపోయాడు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రోడ్‌షోల పేరుతో టీడీపీ నేతలు అడ్డూఅదుపులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్‌షోలలో చంద్రబాబు మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం పెడితే.. చంద్రబాబు ఊరురా బెల్టుషాపులు పెట్టారని అన్నారు. అంతేగాకుండా చంద్రబాబు బినామీలు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని తెలిపారు. […]
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రోడ్‌షోల పేరుతో టీడీపీ నేతలు అడ్డూఅదుపులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్‌షోలలో చంద్రబాబు మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం పెడితే.. చంద్రబాబు ఊరురా బెల్టుషాపులు పెట్టారని అన్నారు. అంతేగాకుండా చంద్రబాబు బినామీలు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని తెలిపారు. దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశారు.. దుర్గమ్మ ఆగ్రహంతో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడని వెల్లడించారు. పుష్కరాల పేరుతో రూ.3 వేల కోట్లు దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కరోనా కష్టకాలంలో 8 నెలలు హైదరాబాద్ పారిపోయారని గుర్తుచేశారు.