చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో వైసీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి 70 శాతం ఓటింగ్ వైసీపీకే అనుకూలంగా ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భావనతోనే ఎన్నికల బహిష్కరణ పేరుతో చంద్రబాబు కుంటి, గుడ్డి సాకులు చెబుతూ, నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బహిష్కరణ పేరుతో […]

Update: 2021-04-05 01:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో వైసీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి 70 శాతం ఓటింగ్ వైసీపీకే అనుకూలంగా ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భావనతోనే ఎన్నికల బహిష్కరణ పేరుతో చంద్రబాబు కుంటి, గుడ్డి సాకులు చెబుతూ, నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బహిష్కరణ పేరుతో టీడీపీ కుట్రపూరిత రాజకీయాలు చేసినా లేదా చంద్రబాబు, అతని పార్ట్‌నర్లు ప్రచారం చేసినా అంతిమ విజయం తమదేనన్నారు.

Tags:    

Similar News