పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బోడిలింగం

దిశ,వెబ్ డెస్క్ : పవన్ కల్యాణ్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేసారని కొడాలి నాని అన్నారు. సోమవారం పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలోని నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. అనేక మంది నానీల్లో ఈయన ఒక నాని అని అన్నారు. సీఎం సాబ్‌కు చెప్పండి ఈ వకీల్‌ […]

Update: 2020-12-29 01:02 GMT

దిశ,వెబ్ డెస్క్ : పవన్ కల్యాణ్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేసారని కొడాలి నాని అన్నారు. సోమవారం పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలోని నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి పవన్ ప్రసంగించారు.

అనేక మంది నానీల్లో ఈయన ఒక నాని అని అన్నారు. సీఎం సాబ్‌కు చెప్పండి ఈ వకీల్‌ సాబ్‌ చెప్పాడని. నివర్‌ తుపానుతో బాధిత రైతులకు తక్షణ సాయం కింద రూ.10వేలు, అసెంబ్లీ సమావేశాల్లోపు రూ.35వేలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ కార్యకర్తలతో అసెంబ్లీయే కాదు. సెంటర్ ఏదైనా, మీటింగ్ ఏదైనా ముట్టడి చేస్తాం. ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదని అన్నారు. అంతే కాదు నేను సినిమాలు చేస్తుంటే పవన్ సినిమాలు చేస్తున్నాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారే. వాళ్లు చేస్తున్నదేంటి?దేశ సేవా? వాళ్లంతా గాంధీ మహాత్ములా? వాళ్లు బిజినెస్ లు చేసుకోవచ్చు. మేం సినిమాలు చేయకూడదా. మీరు వ్యాపారాల్ని వదిలేయండి. నేను సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తామని వ్యాఖ్యానించారు.

అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. పేర్ని నాని ను, తనను బోడి లింగాలు అన్నా పవన్ కళ్యాణ్ పెద్ద బోడి లింగం అంటూ నాని ఫైర్ అయ్యారు. తామిద్దరం శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరెవరో వచ్చి ఏదేదో అడిగితే సమాధానం చెప్పబోమన్నారు. గుడివాడలో పేకాట క్లబ్ లు మూయించానా..? ఆడించానా..? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఏపీలో క్లబ్ లు మూయిస్తున్నారా..?ఆడిస్తున్నారా..? పవన్ బోడిలింగం కాబట్టే ప్రజలు కిందపడేసి తొక్కారని అన్నారు. బోడిలింగం ఎవరో గాజువాక ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.

పవన్ ను ఎవరైనా సినిమాలు మానేయాలని అడిగారా అన్నా పునరుద్ఘాటించారు. ప్రజల తిరస్కరించినా పవన్ ఇలా సిగ్గుశరం లేకుండా మాట్లాడడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టమన్నారు.

Full View

Tags:    

Similar News