‘అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండండి’
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులు కూడా నిండిపోవడంతో ఎక్కడికక్కడ గేట్లు ఎత్తుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎక్కడికక్కడ అలెర్ట్ చేయాలని మంత్రి కన్నబాబు తెలిపారు. కృష్ణాకు వరద ఉధృతి అధికంగా ఉందని అన్నారు. వరద ప్రవాహం నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో, అవుట్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులు కూడా నిండిపోవడంతో ఎక్కడికక్కడ గేట్లు ఎత్తుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎక్కడికక్కడ అలెర్ట్ చేయాలని మంత్రి కన్నబాబు తెలిపారు. కృష్ణాకు వరద ఉధృతి అధికంగా ఉందని అన్నారు. వరద ప్రవాహం నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,65,925 క్యూసెక్కులుగా ఉందన్నారు. ఈ క్రమంలో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు హెచ్చరించారు.