ఘనంగా అయ్యప్ప పడి పూజ.. అన్నీ తానైన మంత్రి..

దిశ సూర్యాపేట: సూర్యాపేటలో మహాపడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం మహా పడి నిర్వహించారు. జాతీయ రహదారి పై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా క్యాంపు కార్యాలయం వరకు సాగిన సంకీర్తన లో సంప్రదాయ వస్త్రాలు ధరించి మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కళాకారులు, కేరళ వాయిద్య చప్పుళ్ళు, మహిళా కోలాటాలు, అయ్యప్ప స్వామి […]

Update: 2021-12-16 05:23 GMT

దిశ సూర్యాపేట: సూర్యాపేటలో మహాపడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం మహా పడి నిర్వహించారు. జాతీయ రహదారి పై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా క్యాంపు కార్యాలయం వరకు సాగిన సంకీర్తన లో సంప్రదాయ వస్త్రాలు ధరించి మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు.

సాంస్కృతిక కళాకారులు, కేరళ వాయిద్య చప్పుళ్ళు, మహిళా కోలాటాలు, అయ్యప్ప స్వామి భక్తుల సంకీర్తనలతో పేట వీధులు మారుమ్రోగాయి. అయ్యప్ప స్వామి ఆలయం నుండి కుమార స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలను పల్లకి లో ఊరేగింపు గా క్యాంపు కార్యాలయం వరకు తీసుకువచ్చారు. సుమారుగా 5 గంటల పాటు సాగిన నగర సంకీర్తన లో మంత్రి జగదీష్ రెడ్డి ఉత్సాహం గా పాల్గొనడమే కాకుండా ,మాలా దారులను ,భక్తులను ఉత్సాహ పరిచారు.

Tags:    

Similar News