‘మూస వ్యవసాయ పద్ధతులకు స్వస్తి పలకాలి’
దిశ, నల్లగొండ: మూస ధోరణిలో చేస్తున్న వ్యవసాయ పద్ధతులకు స్వస్తి పలకాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి రైతాంగానికి రెడ్డి పిలుపునిచ్చారు. లాభదాయక పంటలపై దృష్టి సారించాలని ఆయన రైతులకు సూచించారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో రూ.90 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన రహదారుల నిర్మాణ పనులకు ఆయన శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. లక్ష్మినాయక్ తండా, పాచ్యానాయక్ తండా, కోటపహాడ్, జి.మల్కాపురంతో పాటు కందగట్ల, దురాజ్‌పల్లి, బాలెంల, ముక్కుదేవులపల్లి తదితర గ్రామాల్లో మంత్రి […]
దిశ, నల్లగొండ: మూస ధోరణిలో చేస్తున్న వ్యవసాయ పద్ధతులకు స్వస్తి పలకాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి రైతాంగానికి రెడ్డి పిలుపునిచ్చారు. లాభదాయక పంటలపై దృష్టి సారించాలని ఆయన రైతులకు సూచించారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో రూ.90 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన రహదారుల నిర్మాణ పనులకు ఆయన శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. లక్ష్మినాయక్ తండా, పాచ్యానాయక్ తండా, కోటపహాడ్, జి.మల్కాపురంతో పాటు కందగట్ల, దురాజ్‌పల్లి, బాలెంల, ముక్కుదేవులపల్లి తదితర గ్రామాల్లో మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో మంత్రి మాట్లాడారు. లాభదాయక పంటలపై సీఎం కేసీఆర్ నూతనంగా రూపొందించిన గైడ్ లైన్స్‌ను విధిగా పాటించాలని రైతాంగానికి విజ్ణప్తి చేశారు. ఏయే ప్రాంతాల్లో ఏ పంటలు వేస్తే రైతులకు లాభదాయకమనేది ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యయనం చేశారని వెల్లడించారు. రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆ సంకల్పానికి బలం చేకూర్చే విధంగా రైతాంగం వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, వైస్ చైర్మెన్ వెంకట్ నారాయణ గౌడ్, జెడ్పీటీసీ భిక్షం, ఎంపీపీ రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.