‘అక్రమంగా తరలిస్తే చూస్తూ ఉరుకోం’

దిశ, నల్లగొండ: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించకుండా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో నంబరు 203ను తీసుకొచ్చి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం ముమ్మాటికీ సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రైతులకు ఏ ఇబ్బంది […]

Update: 2020-05-14 10:59 GMT

దిశ, నల్లగొండ: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించకుండా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో నంబరు 203ను తీసుకొచ్చి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం ముమ్మాటికీ సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రైతులకు ఏ ఇబ్బంది రాదన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో కాంగ్రెస్, బీజేపీ ద్వంద వైఖరి అవలంభిస్తున్నాయని, దొంగ దీక్షలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. పదవుల కోసం సీమాంధ్ర నాయకుల ముందు మోకరిల్లి తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం వితండ వాదం చేస్తూ ముందడుగు వేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇక కేంద్రం కొత్తగా తెస్తున్న విద్యుత్ ముసాయిదా బిల్లును తెలంగాణలో అంగీకరించేది లేదని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News