ఓటు వేయకుంటే బాంబులతో దాడులా..? :జగదీష్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: బీజేపీకి ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులతో దాడులు చేస్తారా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం కొత్తపేట డివిజన్లో మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలను కన్నతల్లిలా అక్కున చేర్చుకున్నది హైదరాబాద్ అని… ఇలాంటి నగరంపై కమలనాథులు సర్జికల్ స్ట్రైక్ లంటూ మాట్లాడడమేంటని మండిపడ్డారు. ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు మాత్రమేనని అన్నారు. సర్జికల్ స్ట్రైక్లంటూ నగర […]
దిశ, వెబ్ డెస్క్: బీజేపీకి ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులతో దాడులు చేస్తారా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం కొత్తపేట డివిజన్లో మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలను కన్నతల్లిలా అక్కున చేర్చుకున్నది హైదరాబాద్ అని… ఇలాంటి నగరంపై కమలనాథులు సర్జికల్ స్ట్రైక్ లంటూ మాట్లాడడమేంటని మండిపడ్డారు. ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు మాత్రమేనని అన్నారు.
సర్జికల్ స్ట్రైక్లంటూ నగర ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. 2014లో నగరంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో అదుపులోకి వచ్చాయన్నారు. నగర శివారులో నివాసం ఉండాలంటేనే జనాలు భయకంపితులయ్యే వారని.. అలాంటి ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం రక్షణ కలిపించిందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బల్దియా పీఠం టీఆర్ఎస్కు అప్పగించినందునే రూ. 65 వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి జరిగిందన్నారు.