నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే..
దిశ, నల్గొండ: కరోనా నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కొవిడ్ పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కంటైన్మెంట్ జోన్లను ఆదివారం రాత్రి కలెక్టర్ వినయ్ కృష్ణతో కలిసి సందర్శించారు. ఈ ప్రదేశాల రూట్ మ్యాప్‌లను మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ విపత్కర […]
దిశ, నల్గొండ: కరోనా నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కొవిడ్ పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కంటైన్మెంట్ జోన్లను ఆదివారం రాత్రి కలెక్టర్ వినయ్ కృష్ణతో కలిసి సందర్శించారు. ఈ ప్రదేశాల రూట్ మ్యాప్‌లను మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలెవ్వరూ భయాందోళనలకు గురికాకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. అపరిచితులను కలిసే ప్రయత్నం చేయొద్దన్నారు. మంత్రి వెంట జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, తదితరులు ఉన్నారు.
tags:minister jagadeeshwar reddy, suryapet, containment zone, coronavirus, collector vinay krushna,