లాక్‌డౌన్ అమలు బాధ్యత అధికారులదే : మంత్రి

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంతో పాటు ప్ర‌జ‌ల‌పైనా ఉంద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో లాక్‌‌డౌన్‌ అమలు తీరును మంత్రి ప‌ర్య‌వేక్షించారు. బ‌స్టాండ్, బుధ‌వార్‌పేట్, గాంధీ‌చౌక్, బంగ‌ల్‌పేట్, బాలాజీ‌వాడ, బ్ర‌హ్మ‌పురి, త‌దిత‌ర ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితులను పరిశీలించారు. కూర‌గాయాల దుకాణాలు, రేష‌న్‌షాపుల‌ను ప‌రిశీలించి దుకాణాదారుల‌తో మాట్లాడారు. కరోనా కట్టడికి భౌతిక‌దూరం పాటించాలని, మాస్క్‌లను త‌ప్ప‌నిస‌రిగా ధరించాలని సూచించారు. కర్ఫ్యూ సమయంలో ఎవరూ రాకుండా బయటకు రావద్దని […]

Update: 2020-05-07 01:49 GMT

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంతో పాటు ప్ర‌జ‌ల‌పైనా ఉంద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో లాక్‌‌డౌన్‌ అమలు తీరును మంత్రి ప‌ర్య‌వేక్షించారు. బ‌స్టాండ్, బుధ‌వార్‌పేట్, గాంధీ‌చౌక్, బంగ‌ల్‌పేట్, బాలాజీ‌వాడ, బ్ర‌హ్మ‌పురి, త‌దిత‌ర ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితులను పరిశీలించారు. కూర‌గాయాల దుకాణాలు, రేష‌న్‌షాపుల‌ను ప‌రిశీలించి దుకాణాదారుల‌తో మాట్లాడారు. కరోనా కట్టడికి భౌతిక‌దూరం పాటించాలని, మాస్క్‌లను త‌ప్ప‌నిస‌రిగా ధరించాలని సూచించారు. కర్ఫ్యూ సమయంలో ఎవరూ రాకుండా బయటకు రావద్దని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరం అనుకుంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు.

సిద్ధాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతన్నలు పండించే ప్రతీ ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. భౌతిక‌‌దూరం పాటిస్తూ ధాన్యం అమ్మకాలు పూర్తి చేసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారుల‌కు సూచించారు. ఆయనతోపాటు క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ ఫారూఖీ, ఎస్పీ శ‌శిధ‌ర్ రాజు, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్ పాల్గొన్నారు.

Tags: Minister Indrakaran Reddy, toured, Nirmal, lockdown, corona

Tags:    

Similar News