ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష
దిశ, ఆదిలాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనుసరించాల్సిన విధానంపై సోమవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సింగరేణి అతిథి గృహంలో అధికారులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంపై ప్రజాప్రతినిధులు, అధికారులు, రైస్ మిల్లర్లతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో […]
దిశ, ఆదిలాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనుసరించాల్సిన విధానంపై సోమవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సింగరేణి అతిథి గృహంలో అధికారులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంపై ప్రజాప్రతినిధులు, అధికారులు, రైస్ మిల్లర్లతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో సాగుకు సమృద్ధిగా నీరు అందించడం, నిరంతర విద్యుత్ అందించడం వల్ల 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. మొక్కజొన్న, పత్తి దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ఈ నెల 31 వరకు నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలన్నారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్ భారతి హోలికేరి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
tags: yasangi rice, purchase, immediate, minister allola indrakaran reddy, review