అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
దిశ, ఆదిలాబాద్: మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మల్ కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. మిషన్ భగీరథ ద్వారా అన్ని ప్రాంతాలకు నీరందించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల కోసం మండలాల వారీగా కావాలసిన భూమిని గృహ నిర్మాణ శాఖకు వెంటనే బదిలీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. వెంటనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ […]
దిశ, ఆదిలాబాద్: మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మల్ కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. మిషన్ భగీరథ ద్వారా అన్ని ప్రాంతాలకు నీరందించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల కోసం మండలాల వారీగా కావాలసిన భూమిని గృహ నిర్మాణ శాఖకు వెంటనే బదిలీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. వెంటనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపళ్లి విజయలక్ష్మి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మిషన్ భగీరథ ఎస్ఈ మల్లేశం, పంచాయతీ రాజ్ ఈఈ సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు.