అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధికి కృషి :మంత్రి అల్లోల

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పట్టణ వాసులకు మానసిక ఉల్లాసంతో పాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారి పక్కన కుంటాల సోమన్న హరితవనం పార్కుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ అటవీ బ్లాక్‌లో జనావాసాలకు దగ్గరగా అర్బన్ […]

Update: 2021-02-18 03:51 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పట్టణ వాసులకు మానసిక ఉల్లాసంతో పాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారి పక్కన కుంటాల సోమన్న హరితవనం పార్కుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సంద‌ర్భంగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ అటవీ బ్లాక్‌లో జనావాసాలకు దగ్గరగా అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రకృతి అందాల‌కు నిల‌యంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల‌, పొచ్చెర జ‌ల‌పాతాల‌కు స‌మీపంలో ఫారెస్ట్ పార్కును అభివృద్ది చేస్తున్నామ‌ని స్పష్టం చేశారు. ఇక్కడ‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు ఆహ్లాదాన్ని అందించేలా పార్కును తీర్చి‌దిద్దనున్నట్లు తెలిపారు. ఎక‌రం స్థలంలో హ‌రిత హోట‌ల్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిప్రాద‌న‌లు రూపొందించామ‌ని, అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభిస్తామ‌ని వెల్లడించారు. వాకింగ్ ట్రాక్, జంగిల్ లాడ్జెస్ (కాటేజీలు), వాట్ ట‌వ‌ర్, ప‌గోడాలతో పాటు చిన్న పిల్లలకు ఆట స్థలం, కుటుంబంతో ఆహ్లాదంగా గ‌డిపేలా ఈ పార్కులో ఏర్పాట్లు చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

Tags:    

Similar News