అత్యవసర సమయాల్లో… మెరుగైన వైద్య సేవలు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అంబులెన్సులను ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబులెన్స్ సేవలు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అంబులెన్సులు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ‘గిఫ్ట్ ఏ స్ల్మైల్’ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అంబులెన్సులను ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబులెన్స్ సేవలు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అంబులెన్సులు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు.
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ‘గిఫ్ట్ ఏ స్ల్మైల్’ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ. 61.50 లక్షలతో 3 అంబులెన్సులను అందజేశారు. ఈ వాహనాల్లో ఆక్సీజన్, వెంటిలేటర్‌తో సహా, అత్యాధునిక సదుపాయాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కె.విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ యువజన నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.