అలా ఉత్సవాలు జరుపుకుంటే.. అందరికీ మంచిది
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రం పండగను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలను, మొహర్రం వేడుకలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జన సమూహం లేకుండా, ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు, ప్రార్థనలు వద్దని కోరారు. పండగలను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రం పండగను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలను, మొహర్రం వేడుకలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
జన సమూహం లేకుండా, ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు, ప్రార్థనలు వద్దని కోరారు. పండగలను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా నిబంధనలు ప్రజలు తప్పుకుండా పాటించాలని సూచించారు. నిబంధనల్లో భాగంగా సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం తప్పనిసరిగా పాటిస్తే అందరికీ మంచిదని అన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.