బిగ్ బ్రేకింగ్.. హుటాహుటిన హుజురాబాద్‌కు మంత్రి హరీశ్.. స్పెషల్ ఆపరేషన్.?

దిశ ప్రతినిధి, కరీంనగర్ : శనివారం రాత్రి మంత్రి హరీశ్ రావు హుటాహుటిన హుజురాబాద్ చేరుకున్నారు. సింగాపురంలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు గెస్ట్ హౌజ్ లో సీరియస్ మంతనాలు జరుపుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాఖీ పౌర్ణమి పర్వదినం ఉన్నప్పటికీ మంత్రి హరీశ్ హుజురాబాద్ చేరుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి చేరుకునే సరికే జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన ముఖ్య నాయకులను పిలిపించడం గమనార్హం. రాత్రి వేళల్లో ఇక్కడకు మంత్రి రావడం, పలువురు నాయకులతో భేటీ జరపడం […]

Update: 2021-08-21 10:44 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : శనివారం రాత్రి మంత్రి హరీశ్ రావు హుటాహుటిన హుజురాబాద్ చేరుకున్నారు. సింగాపురంలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు గెస్ట్ హౌజ్ లో సీరియస్ మంతనాలు జరుపుతుండడం చర్చనీయాంశంగా మారింది.

ఆదివారం రాఖీ పౌర్ణమి పర్వదినం ఉన్నప్పటికీ మంత్రి హరీశ్ హుజురాబాద్ చేరుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి చేరుకునే సరికే జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన ముఖ్య నాయకులను పిలిపించడం గమనార్హం. రాత్రి వేళల్లో ఇక్కడకు మంత్రి రావడం, పలువురు నాయకులతో భేటీ జరపడం వెనక ఆంతర్యం ఏంటోనన్న చర్చ సాగుతోంది.

ఎవరా నలుగురు.?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు తిరిగి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. వీరితో హరీశ్ రావు మంతనాలు జరిపేందుకు వచ్చారా.? లేక స్పెషల్ ఆపరేషన్ కోసం వచ్చారా.? అన్న విషయం గురించి అటు టీఆర్ఎస్ నాయకుల్లో ఇటు ఈటల శిబిరంలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. హరీశ్ రావు ప్రత్యేకంగా హుజురాబాద్ చేరుకున్నారంటే కీలకమైన మార్పులు జరగబోతున్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

అంతా సీక్రెట్..

మంత్రి హరీశ్ రావు సింగాపురం గెస్ట్ హౌజ్‌కు చేరుకున్న తర్వాత లోపల జరుగుతున్న పరిణామాలు బయటకు పొక్కడం లేదు. నమ్మకమైన వారిని మాత్రమే లోపలకు అనుమతించడంతో అంతర్గతంగా జరుగుతున్న విషయాలేవీ తెలియడం లేదు.

ఈటల అక్కడే..

హుజురాబాద్ శివార్లలోని కెప్టెన్ గెస్ట్ హౌజ్‌లో మంత్రి హరీశ్ రావు ఉండగా మాజీ మంత్రి ఈటల హుజురాబాద్ పట్టణంలోని ఓ నాయకుడి ఇంట్లో మకాం వేశారు. హైదరాబాద్‌లో చికిత్స పొందిన తరువాత నుంచి జమ్మికుంటలో ఉంటూ సమీకరణాలు జరుపుతున్న ఈటల కూడా హుజురాబాద్‌కు చేరుకుని టీఆర్ఎస్ పార్టీ నేతల గురించి ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. దీంతో శనివారం సాయంత్రం వరకూ నియోజకవర్గంలో స్తబ్దుగా ఉన్న పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది.

Tags:    

Similar News