బసవేశ్వర జయంతి వేడుకల్లో మంత్రి హరీశ్ రావు

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో మహాత్మా బసవేశ్వర 887 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. బసవేశ్వర విగ్రహానికి వారు పూలమాల వేసి స్మరించుకున్నారు. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన రక్త దానం శిబిరాన్ని ఇరువురు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బసవేశ్వరుని బోధనలు ఎప్పటికీ ఆదర్శనీయమని అన్నారు. అలాగే కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ ఇంట్లోనే […]

Update: 2020-04-26 07:06 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో మహాత్మా బసవేశ్వర 887 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. బసవేశ్వర విగ్రహానికి వారు పూలమాల వేసి స్మరించుకున్నారు. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన రక్త దానం శిబిరాన్ని ఇరువురు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బసవేశ్వరుని బోధనలు ఎప్పటికీ ఆదర్శనీయమని అన్నారు. అలాగే కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉంటూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

కూలీలకు రూ: 1.96 కోట్ల నిధులు విడుదల

జిల్లాలోని ఉపాధి హామీ పథకము ద్వారా పని చేస్తున్న కూలీలకు రూ. 1.96 కోట్ల నిధులు విడుదల అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కూలీల నిధులు పోస్ట్ ఆఫీసుల్లో వచ్చి నిలువ ఉన్నాయని చెప్పారు. అయితే, పోస్ట్ ఆఫీసు ద్వారా బయో మెట్రిక్ పద్దతిలో ఇవి చెల్లించాల్సి ఉంది. కాగా, కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో బయో మెట్రిక్ పద్దతి నిలిచిపోవడంతో.. బకాయిలను నిలిపి వేయడం జరిగిందన్నారు. లాక్‌డౌన్‌, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ఉపాధి హామీ పథకంపై ఆధారపడి పని చేస్తున్న కూలీలకు డబ్బులు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. పోస్ట్ ఆఫీస్ కార్యాలయాల్లో నిలువ ఉన్న రూ. 1.96 కోట్లు విడుదల చేస్తూ సూచనలు ఇవ్వడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నుంచే జిల్లాలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఈ చెల్లింపులు చేపడుతారని హరీశ్ రావు వెల్లడించారు.

tag: minister harish rao, bb patil, basaveshwara jayanthi, sangareddy

Tags:    

Similar News