గెలుపు విషయం కాదు.. మాకు మెజార్టీ కావాలి.. హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, కమలాపూర్: ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ అనేక పదవులు ఇచ్చిందని, ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్పా అన్నీ ఇచ్చిందని మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటువంటి పార్టీని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు చేశాడని మండిపడ్డారు. సోమవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు […]
దిశ, కమలాపూర్: ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ అనేక పదవులు ఇచ్చిందని, ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్పా అన్నీ ఇచ్చిందని మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటువంటి పార్టీని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు చేశాడని మండిపడ్డారు. సోమవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని, కేవలం మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. కమలాపూర్ గడ్డకు చరిత్ర ఉందని, ఈటల చేరకముందే కమలాపూర్ గడ్డమీద టీఆర్ఎస్ జెండా ఎగిరిందని గుర్తుచేశారు.
ఈటల గులాబీ జెండా నీడలో ఉండి అంతా తన బలం అనుకున్నాడని, కానీ అదంతా గులాబీ జెండా బలం అని తెలుసుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. నాడు 2004లో ఈటల పోటీ చేసినప్పుడు ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలుస్తాడని ఎంత ధైర్యంగా ఉన్నామో, నేడు కూడా ఈటలపై గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని అంతే ధైర్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇన్నేండ్లు మంత్రిగా ఉండి కూడా ఈటల సొంత మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే బాల్కసుమన్ , కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, పెండ్యాల రవీందర్ రావు పాల్గొన్నారు.