సాగునీటి ఇబ్బంది లేకుండా చేయడమే కేసీఆర్ ధ్యేయం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భారీ రిజర్వాయర్లను నిర్మించి, నీటిని నిల్వచేసి, రాష్ట్ర ప్రజలకు 365 రోజులు సాగునీటి ఇబ్బంది లేకుండా చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రాజెక్టులు, జలాశయాల నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో చెక్ డ్యాంలు నిర్మించడం వల్ల కలిగిన ప్రయోజనాలపై మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ […]
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భారీ రిజర్వాయర్లను నిర్మించి, నీటిని నిల్వచేసి, రాష్ట్ర ప్రజలకు 365 రోజులు సాగునీటి ఇబ్బంది లేకుండా చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రాజెక్టులు, జలాశయాల నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో చెక్ డ్యాంలు నిర్మించడం వల్ల కలిగిన ప్రయోజనాలపై మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించామని, దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు.
ఈసారి ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసి, చెరువులన్నీ నిండిపోయి అలుగు పారాయే కానీ ఏ ఒక్క చెరువుకట్ట కూడా తెగలేదని తెలిపారు. అంతేగాకుండా గోదావరిలో రాష్ట్రానికి హక్కుగా ఉన్నటువంటి 928 టీఎంసీలు, కృష్ణానదిలో ప్రస్తుతం తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల నీటిని ప్రజలకు ఉపయోగకరంగా వినియోగించేందుకు ఒడిసిపట్టాలని సీఎం అన్నారని తెలిపారు. చెక్‌డ్యాంల నిర్మాణం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరాయని వివరించారు. వీటివల్ల భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 3.09 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయని, అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6.03 మీటర్లు పెరిగాయని మంత్రి వెల్లడించారు.