ఈ నెల 20న పల్లె పల్లెన కేంద్రంపై నిరసనలు వెల్లువెత్తాలి.. హరిష్ రావు
దిశ, సిద్దిపేట: టీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నాలు చేయాలని మంత్రి హరిష్ రావు చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి.. రైతు శ్రేయస్సే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతు భాంధవునిగా తెలంగాణ […]
దిశ, సిద్దిపేట: టీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నాలు చేయాలని మంత్రి హరిష్ రావు చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి.. రైతు శ్రేయస్సే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతు భాంధవునిగా తెలంగాణ ప్రభుత్వం.. రైతు రాబందుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. అన్నింటిని అమ్ముతున్న కేంద్రం తెలంగాణ రైతులు పండించిన వరిని మాత్రం కొనడం లేదన్నారు. వరి ధాన్యాన్ని కొంటారా.. కొనారా అని సీఎం కేసీఆర్ సూటిగా అడిగితే నేటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం లేదన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, ఎరువులు, విత్తనాలు, కాళేశ్వరం ద్వారా నీళ్లు, 24 గంటల కరెంటు ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. పంజాబ్‌లో ఒక విధానం తెలంగాణకు ఒక విధానమా.. భారత రాజ్యాంగం నిర్దేశించినట్లు గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు తమతమ విధులు నిర్వహించాలని సూచించారు. యాసంగికి ఇంకా విధానాలు ప్రకటించలేదు.. వానాకాలంలో కొంటాం అన్న పంటను కొనకుండా తత్సర్యం చేస్తుందన్నారు. ఈ ధర్నాలో రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.