జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని నిరుపేద కుటుంబాలకు, జర్నలిస్టులకు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారికి ప్రపంచం అతలాకుతలం అవుతుందన్నారు. ఇలాంటి సందర్భం ఎప్పుడూ చూడలేదు, వినలేదు అని హరీశ్‌రావు అభివర్ణించారు. వ్యాధి లక్షణాలు కనపడకుండానే కరోనా పాజిటివ్ కేసులు చవిచూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని ఆయన సూచించారు. […]

Update: 2020-04-22 10:34 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని నిరుపేద కుటుంబాలకు, జర్నలిస్టులకు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారికి ప్రపంచం అతలాకుతలం అవుతుందన్నారు. ఇలాంటి సందర్భం ఎప్పుడూ చూడలేదు, వినలేదు అని హరీశ్‌రావు అభివర్ణించారు. వ్యాధి లక్షణాలు కనపడకుండానే కరోనా పాజిటివ్ కేసులు చవిచూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జర్నలిస్టులకు అండగా నిలవడం అభినందనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతారావు, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Minister Harish Rao, distributes, essentials, journalists, sangareddy

Tags:    

Similar News