మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది :హరీష్ రావు
దిశ, వెబ్‌డెస్క్: మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. శనివారం హరీష్ రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులకు ఓటు వేస్తే లాభం లేదన్నారు. పీవీ కూతురు సురభి వాణీదేవి విద్యావేత్త, సేవాభావం కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఈ ఎన్నికల్లో 70 నుంచి 80 శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. […]
దిశ, వెబ్‌డెస్క్: మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. శనివారం హరీష్ రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులకు ఓటు వేస్తే లాభం లేదన్నారు. పీవీ కూతురు సురభి వాణీదేవి విద్యావేత్త, సేవాభావం కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఈ ఎన్నికల్లో 70 నుంచి 80 శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం పెరిగితే టీఆర్ఎస్ దే విజయమని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వడం బీజేపీకి చేతకాదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో దేశవృద్ధి రేటు మైనస్‌లోకి పడిపోయిందని అన్నారు. తెలంగాణ 14 శాతం వృద్ధి రేటు సాధించిందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే కిషన్ రెడ్డి తప్పించుకున్నారని హరీష్ రావు తెలిపారు.