పరిమితిలోనే తెలంగాణ అప్పులు..

దిశ, న్యూస్‌బ్యూరో తెలంగాణ రాష్ట్రం తన పరిమితి పరిధిలోనే అప్పులు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ కేంద్ర ప్రభుత్వ విధివిధానాలకు లోబడే రాష్ట్రాలు అప్పులు తీసుకుంటాయని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రం తన జీడీపీలో 49శాతం అప్పులు తీసుకుంటే తెలంగాణ జీఎస్‌డీపీలో 21.03శాతానికి లోబడి మనం అప్పులు తీసుకున్నామని మంత్రి హరీశ్ వివరించారు. దేశంలో 19 రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి […]

Update: 2020-03-12 05:25 GMT

దిశ, న్యూస్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రం తన పరిమితి పరిధిలోనే అప్పులు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ కేంద్ర ప్రభుత్వ విధివిధానాలకు లోబడే రాష్ట్రాలు అప్పులు తీసుకుంటాయని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రం తన జీడీపీలో 49శాతం అప్పులు తీసుకుంటే తెలంగాణ జీఎస్‌డీపీలో 21.03శాతానికి లోబడి మనం అప్పులు తీసుకున్నామని మంత్రి హరీశ్ వివరించారు. దేశంలో 19 రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకున్నాయని, ఆ జాబితాలో చివరి నుంచి ఆరో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని కాంగ్రెస్ సభ్యులకు తెలిపారు.

Tags: ts state loans, frbm under limit, minister harish rao, congress mla’s

Tags:    

Similar News