పదవులు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే శాశ్వతం: హరీశ్ రావు

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ పదవులు కాదు, రాష్ర్ట ప్రయోజనాలే శాశ్వతమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ కోసం కొత్త చట్టం తేవాలని బండి సంజయ్ రాసిన లేఖలో పేర్కొనడం దుర్మార్గమని, రాజకీయ పదవుల కోసం రాష్ట్ర ప్రయోజలను పణంగా పెట్టడం బాధాకరమన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తెస్తే సన్మానాలు చేస్తామన్నారు. బండి సంజయ్ కేంద్ర […]

Update: 2021-03-25 12:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ పదవులు కాదు, రాష్ర్ట ప్రయోజనాలే శాశ్వతమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ కోసం కొత్త చట్టం తేవాలని బండి సంజయ్ రాసిన లేఖలో పేర్కొనడం దుర్మార్గమని, రాజకీయ పదవుల కోసం రాష్ట్ర ప్రయోజలను పణంగా పెట్టడం బాధాకరమన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తెస్తే సన్మానాలు చేస్తామన్నారు.

బండి సంజయ్ కేంద్ర జలాశక్తికి లేఖ రాశారని, అందులో సీడబ్ల్యూసీ క్లీయరెన్స్ వచ్చే వరకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని పేర్కొన్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చట్ట విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం చట్టపరంగా పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారి పాడెలను తాను మోసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ర్ట సాధన ఉద్యమంలో టీ కాంగ్రెస్ నేతలు పాల్గొనలేదని.. పోరాటం చేయలేదని.. పీజేఆర్ తప్ప మిగతా వారు ఎవరూ ఉద్యమానికి సహకరించలేదన్నారు.

అనుమతులతోనే కాళేశ్వరం నిర్మాణం

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సాగు, తాగు నీరందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని మంత్రి తెలిపారు. లక్షల ఎకరాలకు ప్రాజెక్టుతో నీరందిస్తున్నామని కొంత మంది పని గట్టుకొని ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని అనుమతులతోనే ప్రాజెక్టును నిర్మించామని తెలిపారు.

Tags:    

Similar News