సీఎం కేసీఆర్ దృష్టికి రైస్‌మిల్లర్ల సమస్యలు : గంగుల

దిశ, తెలంగాణ బ్యూరో: రైస్ మిల్లర్ల న్యాయపరమైన సమస్యల పరిష్కార విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని పౌర సరఫరాల భవన్‌లో సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ అనిల్ కుమార్‌తో కలిసి వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో మంత్రి సమీక్షించారు. ఈ ఏడాది వానాకాలంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతోన్న నేపథ్యంలో ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి […]

Update: 2020-10-29 07:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రైస్ మిల్లర్ల న్యాయపరమైన సమస్యల పరిష్కార విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని పౌర సరఫరాల భవన్‌లో సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ అనిల్ కుమార్‌తో కలిసి వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో మంత్రి సమీక్షించారు. ఈ ఏడాది వానాకాలంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతోన్న నేపథ్యంలో ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

గతేడాది వానా కాలంలో 3,670 కొనుగోలు కేంద్రాల ద్వారా 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఈసారి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఐకెపీ 2131, పీఎసీఎస్ 3964, ఇతర 313 మొత్తం 6,400లను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు నిజామాబాద్ , కామారెడ్డి , మెదక్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో 1, 071 కేంద్రాలను ప్రారంభిచినట్టు ఆయన వెల్లడించారు. ఆయా జిల్లాల్లో స్థానిక అవసరాలను బట్టి అప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కమలాకర్ తెలిపారు.

కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం తేమశాతం 17లోపు వుండేలా, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని స్పష్టంచేశారు. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో చేస్తున్నారని, ఆయన ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News