మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ని అడ్డుకున్న కాంగ్రెస్ నేత.. ఏం చేశాడంటే..?
దిశ, స్టేషన్ ఘన్ పూర్: రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ బుధవారం నియోజకవర్గ కేంద్రంలో అడ్డుకున్నారు. ఘనపూర్ మీదుగా పాలకుర్తి వెళుతున్న దయాకర్ రావు కాన్వాయ్ ని అడ్డుకోవడంతో పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది అతని తప్పించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ మంత్రిని కలిసి గాంధీ చౌరస్తా నుండి రైల్వే గేట్ వరకు చేపట్టిన రోడ్డు పనులపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చూపుతున్నారని మంత్రి […]
దిశ, స్టేషన్ ఘన్ పూర్: రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ బుధవారం నియోజకవర్గ కేంద్రంలో అడ్డుకున్నారు. ఘనపూర్ మీదుగా పాలకుర్తి వెళుతున్న దయాకర్ రావు కాన్వాయ్ ని అడ్డుకోవడంతో పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది అతని తప్పించేందుకు ప్రయత్నించారు.
అయినప్పటికీ మంత్రిని కలిసి గాంధీ చౌరస్తా నుండి రైల్వే గేట్ వరకు చేపట్టిన రోడ్డు పనులపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చూపుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. రోడ్డుపై దుమ్ము ధూళి, మురుగు నీటి తో దుర్గంధం వెదజల్లే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతింటున్నాయని వివరించారు. స్పందించిన మంత్రి పనులు పూర్తి అయ్యేలా చేస్తానని మంత్రి హామీ ఇచ్చి ముందుకు సాగారు.