వరంగల్‌కు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు: ఎర్రబెల్లి

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో హై అలర్ట్‌ ప్రకటించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సీఎం సీఎం కేసీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలపై సమీక్ష జరిపారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లికి సూచించారు. దీంతో పర్వతగిరిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి ఎర్రబెల్లి టెలీకాన్ఫరెన్స్‌‌లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. గోదావరి పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా […]

Update: 2020-08-15 11:15 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో హై అలర్ట్‌ ప్రకటించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సీఎం సీఎం కేసీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలపై సమీక్ష జరిపారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లికి సూచించారు.

దీంతో పర్వతగిరిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి ఎర్రబెల్లి టెలీకాన్ఫరెన్స్‌‌లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. గోదావరి పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరంగల్‌ జిల్లాలో లోతట్టు ప్రాంతాల నుంచి 2,600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వరంగల్‌కు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Tags:    

Similar News