ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలి: ఎర్రబెల్లి

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించిన పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా పనులు నిర్ణీత గడువులో సమర్థవంతంగా జరిగేలా చూడాలని, ఉద్యమ స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలన్నారు. పథకాల అమలు బాధ్యత అధికారులదేనన్నారు. ప్రతి గ్రామంలో ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, నరేగాను వ్యూహాత్మకంగా వాడుకోవాలని […]

Update: 2020-06-18 07:57 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించిన పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా పనులు నిర్ణీత గడువులో సమర్థవంతంగా జరిగేలా చూడాలని, ఉద్యమ స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలన్నారు. పథకాల అమలు బాధ్యత అధికారులదేనన్నారు. ప్రతి గ్రామంలో ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, నరేగాను వ్యూహాత్మకంగా వాడుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. సమీక్షలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు పాల్గొన్నారు.

Tags:    

Similar News