యోజన ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని పంచాయ‌తీరాజ్ వ్యవ‌స్థ, గ్రామీణాభివృద్ధికి చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి కార్యక్రమాల‌పై ప్రత్యేకంగా రూపొందించిన‌ కేంద్ర ప్రభుత్వ అధికారిక మాస ప‌త్రిక యోజ‌న‌ న‌వంబ‌ర్ ప్రత్యేక సంచికను హైద‌రాబాద్‌లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ‌న రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిక మాస ప‌త్రిక తెలంగాణలాగా, కేంద్రంలో ప్రభుత్వ అధికారిక ప‌త్రిక యోజ‌న‌ అన్నారు. అభివృద్ధి సంక్షేమ ప‌త్రిక‌గా దేశంలో యోజ‌న‌ ప‌త్రిక‌కు […]

Update: 2021-10-31 02:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని పంచాయ‌తీరాజ్ వ్యవ‌స్థ, గ్రామీణాభివృద్ధికి చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి కార్యక్రమాల‌పై ప్రత్యేకంగా రూపొందించిన‌ కేంద్ర ప్రభుత్వ అధికారిక మాస ప‌త్రిక యోజ‌న‌ న‌వంబ‌ర్ ప్రత్యేక సంచికను హైద‌రాబాద్‌లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ‌న రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిక మాస ప‌త్రిక తెలంగాణలాగా, కేంద్రంలో ప్రభుత్వ అధికారిక ప‌త్రిక యోజ‌న‌ అన్నారు.

అభివృద్ధి సంక్షేమ ప‌త్రిక‌గా దేశంలో యోజ‌న‌ ప‌త్రిక‌కు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల‌కు కూడా ఈ యోజ‌న ప‌త్రిక మంచి స‌మాచార వాహిక‌ అన్నారు. తెలంగాణ‌లోని ఆద‌ర్శ గ్రామాలు, వాటి అభివృద్ధిపైనా ప్రత్యేక వ్యాసాలు రాశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కోసం తీసుకుంటున్న చ‌ర్యలు, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల మీద ప్రత్యేకంగా రాశారని కొనియాడారు. ప‌ల్లె ప్రగతి, ప‌ట్టణ ప్రగ‌తి వంటి కార్యక్రమాల‌తో గ్రామాల‌ను ఆద‌ర్శంగా మార్చినట్టు రాశారని ఎర్రబెల్లి తెలిపారు.

గంగిదేవిప‌ల్లె, ఇబ్రహీంపూర్‌, అంకాపూర్ లాంటి అనేక ఆద‌ర్శ గ్రామాల వివ‌రాలు ప్రత్యేకంగా ఇచ్చారని అన్నారు. డంపింగ్ యార్డులు, ప‌ల్లె ప్రకృతి వ‌నాలు, బృహ‌త్ ప్రకృతి వ‌నాలు, శ్మశాన వాటిక‌లు, హ‌రిత హారం, గ్రామాల‌కు హ‌రిత నిధి, ఉపాధి హామీ, తండాలు, ఆదివాసీ ప్రాంతాల్లో పెసా చ‌ట్టం ప్రకారం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలిపారని అన్నారు. గ్రామాల స్థాయిలో ఆస్తుల ప‌రిర‌క్షణ‌కు తీసుకుంటున్న చ‌ర్యలు, గ్రామ పంచాయ‌తీల‌ డిజిట‌లైజేష‌న్, పార‌ద‌ర్శక‌మైన ఆడిటింగ్‌ వంటి అనేక అంశాల మీద ప్రత్యేకంగా వ్యాసాలు రాసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యోజ‌న ప‌త్రిక సీనియ‌ర్ ఎడిట‌ర్ కృష్ణ వంద‌న. పి. ఎడిట‌ర్ సిరాజుద్దీన్ మ‌హ్మద్, I & PR డిప్యూటీ డైరెక్టర్ వై. వెంక‌టేశ్వర్లు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News