తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా మరింత ఎదగాలి : ఎర్రబెల్లి

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ధర్మకర్తలు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారి దర్శనం చేయించారు. వేదపండితులు స్వామి వారి వస్త్రాలతో సన్మానించి ఆశీర్వచనం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ స్వామి వారిని రెండు రాష్ట్రాల […]

Update: 2021-10-10 06:56 GMT

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ధర్మకర్తలు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారి దర్శనం చేయించారు. వేదపండితులు స్వామి వారి వస్త్రాలతో సన్మానించి ఆశీర్వచనం అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ స్వామి వారిని రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. స్వామి వారి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రెండు రాష్ట్రాలు ఆర్థికంగా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News