పదిరోజుల్లో పనులన్నీ పూర్తవ్వాలి.. మంత్రి ఎర్రబెల్లి ఆదేశం
దిశ, ఖమ్మం: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తో కలసి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రఘనాథపాలెం మండలం హర్యాతండా, సూర్యాతండా, రాంక్యాతండాలో వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్స్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. హరితహారం కింద […]
దిశ, ఖమ్మం: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తో కలసి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రఘనాథపాలెం మండలం హర్యాతండా, సూర్యాతండా, రాంక్యాతండాలో వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్స్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. హరితహారం కింద ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. అనంతరం రాంక్యాతండాలో జరిగిన గ్రామ సభలో రఘనాథపాలెం మండలంలోని మూడు తండాలలో జరుగుతున్న పల్లెప్రగతి పనులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. పెండింగ్ పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా మంచుకొండలో పారిశుధ్య పనులు, హరితహారం కింద నాటుతున్న మొక్కల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపట్ల మంత్రి సంబంధిత అధికారులను సత్వర చర్యలకై ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపుల నాటిన చిన్న మొక్కలను తొలగించి పెద్ద మొక్కలను నాటాలని, వాటికి శాశ్వత రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు భీమా, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ పథకాల గురించి తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు నష్టం కలుగకూడదని రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు.
రఘనాథపాలెం మండలం అభివృద్దికి ఇప్పటి వరకు రూ.15 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పల్లెప్రగతి ద్వారా జిల్లాలోని ప్రతి పల్లెను పురోగతిలోకి తీసుకెళ్ళామన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్దులు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ పాల్గొన్నారు.