ఆరేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగింది: ఎర్రబెల్లి

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి ‘ప‌ల్లె ప్ర‌గ‌తి’ ప‌ట్టం క‌ట్టింద‌ని, స‌క‌ల గ్రామాల స‌మ‌గ్ర అభివృద్ధికి ఈ ప‌థ‌కం దోహ‌దం చేస్తున్న‌ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయన మట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర‌ం వచ్చి 70ఏండ్లు దాటినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ గ్రామాల్లో సమగ్ర వికాసం లక్ష్యంగా పల్లె ప్రగతి అనే ప‌థ‌కానికి […]

Update: 2020-03-12 02:35 GMT

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి ‘ప‌ల్లె ప్ర‌గ‌తి’ ప‌ట్టం క‌ట్టింద‌ని, స‌క‌ల గ్రామాల స‌మ‌గ్ర అభివృద్ధికి ఈ ప‌థ‌కం దోహ‌దం చేస్తున్న‌ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయన మట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర‌ం వచ్చి 70ఏండ్లు దాటినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ గ్రామాల్లో సమగ్ర వికాసం లక్ష్యంగా పల్లె ప్రగతి అనే ప‌థ‌కానికి రూపకల్పన చేసి, గ్రామాల రూపురేకలు మార్చరన్నారు. పల్లె ప్రగతి ముఖ్య ఉద్ధేశ్యం పరిశుభ్రమైన గ్రామీణ వాతావరణంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అన్నారు. దానికి అనుగుణంగా మొదటి ఐదేండ్లల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి సారించి కాళేశ్వరం ప్రాజెక్టు, 24గంటల కరెంటు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, హాస్టళ్లో సన్న బియ్యం, కొత్త గురుకుల పాఠశాలలు, మొదలగు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మానవీయ కోణంలో ప్రవేశపెట్టారని తెలిపారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి, గ్రామాల రూపురేఖలు మార్చరన్నారు. తెలంగాణ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి, స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టతనిచ్చింది. నిర్లక్ష్యం చేయబడి, అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల పల్లెలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడెములను ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక పంచాయతీలుగా మార్చి వారికి స్వపరిపాలన చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించారు. డ్రయినేజీలు, మొక్కలు నాటడాలు, తడి,పొడి చెత్త వేరు చేయడాలు, ఇతర పరిశుభ్రతపై అనేక అభివృద్ధి జరిగిందన్నారు.

tags : minister errabelli dayakar rao, assemebli, 6years of TRS govt, villages devalopment, hostels, urbun doovelopment

Tags:    

Similar News